పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'కాటమరాయుడు' హితబోధ... నోట్‌బుక్‌లో స్వదస్తూరితో కొన్ని సూక్తులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'కాటమరాయుడు' హితబోధ చేశారు. అదీ కూడా సినిమా షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... నోట్‌బుక్‌లో స్వదస్తూరితో కొన్ని సూక్తులు రాశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'కాటమరాయుడు' హితబోధ చేశారు. అదీ కూడా సినిమా షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... నోట్‌బుక్‌లో స్వదస్తూరితో కొన్ని సూక్తులు రాశాడు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇలా హితబోధ చేయడానికి కారణం లేకపోలేదు.
ఇటీవలి పవన్ అభిమాని వినోద్ రాయల్ బెంగుళూరులో మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యతో పవన్ ఎంతో కలత చెందాడు. ఆ తర్వాత అభిమానులనుద్దేశించి పవన్ మాట్లాడాడు కూడా. ఇలాంటి గొడవలు పడొద్దని హితవు కూడా చెప్పాడు. ఆ తర్వాత తిరుపతి, కాకినాడ సభలను నిర్వహించి జనసేన కార్యకలాపాలను విస్తృతం చేశాడు.
ప్రస్తుతం తాను నటిస్తున్న 'కాటమరాయుడు' సినిమా కోసం కొన్ని వర్కౌట్ల నిమిత్తం బెంగళూరు వెళ్లాడు. దానికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగాడు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. పనిలోపనిగా ఓ అభిమాని అంటే ఎలా ఉండాలో.. పాఠం చెప్పాడు. నోట్‌బుక్‌లో స్వదస్తూరితో కొన్ని సూక్తులు రాశాడు.
దాని సారాంశం ఏంటంటే... 'ఏం చేసినా అది మన నియంత్రణలో ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించని పని ఏదైనా చేయండి' అని రాశాడు. అంతకన్నా ముందు డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్లను పోషించాలని, అదే అన్నింటికన్నా ముఖ్యమని వారికి హితవు పలికాడు. ఇక, ఏం చేసినా కలిసికట్టుగా చేయాలని, పక్క ఊళ్లో వాళ్లు చేసిన పోరాటాల స్ఫూర్తిగా వారి సహాయ సహకారాలను తీసుకోవాలని సూచించాడు. నైతిక బలం చాలా ముఖ్యమన్నాడు.