1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (15:10 IST)

పవన్ కల్యాణ్ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేశాడా? నిజమేనా?

టాలీవుడ్ పవర్ స్టార్ డాక్టర్ చంద్రశేఖర్ కాళ్లు మొక్కాడంటే నమ్ముతారా? ఇదేంటి.. కేసీఆర్.. కాళ్ళపై పవన్ కల్యాణ్ పడ్డారా.. అనుకోవద్దు. ఈ చంద్రశేఖర్ ఎవరంటే.. ప్రముఖ కంటి డాక్టర్ చంద్రశేఖర్. ఈ మధ్యనే తన భార

టాలీవుడ్ పవర్ స్టార్ డాక్టర్ చంద్రశేఖర్ కాళ్లు మొక్కాడంటే నమ్ముతారా? ఇదేంటి.. కేసీఆర్.. కాళ్ళపై పవన్ కల్యాణ్ పడ్డారా.. అనుకోవద్దు. ఈ చంద్రశేఖర్ ఎవరంటే.. ప్రముఖ కంటి డాక్టర్ చంద్రశేఖర్. ఈ మధ్యనే తన భార్య, కుమారుడిని పోగొట్టుకున్నా.. మనో నిబ్బరంతో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. 
 
ఆయన సేవాభావం గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా ఆయన కాళ్ళు మొక్కారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్.. పవన్ మంచితనం గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. 
 
ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ జనసేన సభ ఏర్పాటు చేసిన సంగతి  తెలిసిందే. ఈ సభ కోసం పవన్ ఓ రోజు ముందే కాకినాడకు చేరుకున్నాడు. కాగా కాకినాడలోని చంద్రశేఖర్ ఆసుపత్రికి వెళ్లిన పవన్ కళ్యాణ్, డాక్టర్ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేయడంతో అందరూ షాక్ తిన్నారు. ఇంకా మీరు చేస్తున్న సేవ ఎంతో ఉన్నతమైందంటూ డాక్టర్‌కు కితాబిచ్చారు.