మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (12:35 IST)

OTTలో పెద్దన్న: సడెన్‌గా డిజిటల్‌గా స్ట్రీమింగ్‌లో వచ్చేసింది..

సూపర్ స్టార్ రజనీ కాంత్ పెద్దన్న సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ సినిమాలు శాసించిన రోజులున్నాయి. కొన్నాళ్లగా రజనీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆయనకి వయసు మీదపడినా కెమెరా ముందు జోరు మాత్రం తగ్గలేదని ప్రతి సినిమాలో కనిపించినా సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదు.
 
ఈ మధ్య సినిమాల స్పీడ్‌ని తగ్గించిన రజనీకాంత్.. లేట్ అయినా అన్నాత్తైతో లేటెస్ట్‌గా వచ్చాడు. భారీ స్టార్ కాస్ట్‌తో శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దన్నగా దీపావళికి వచ్చేసింది. తెలుగులో ఈ సినిమా భారీ డిజాస్టర్ మూటగట్టుకోగా తమిళంలో మాత్రం రజని మేనియాతో వసూళ్ల పరంగా బయటపడింది. 
 
ఇప్పటికీ అక్కడ ఈ సినిమాకి వసూళ్లు స్టడీగానే ఉన్నాయని రజనీ అభిమానులు సోషల్ మీడియాలో ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే, వసూళ్లు స్టడీగానే ఉన్నాయని చెప్తున్నా.. ఈ సినిమా అసలు ఎలాంటి అప్డేట్ కూడా లేకుండా సడెన్‌గా డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.