గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (22:40 IST)

వరుణ్-లావణ్య హల్దీ- మెగాస్టార్ లుక్ అదుర్స్.. 25ఏళ్ల కుర్రాడిలా..?

Chirajeevi
Chirajeevi
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి ఇటలీ వేదిక కానుంది. సోమవారం కాక్ టైల్ పార్టీ, మంగళవారం హల్దీ వేడుకలు వైభవంగా జరిగాయి. 
 
హల్దీ వేడుకల్లో పసుపు వర్ణం దుస్తుల్లో లావణ్య, వరుణ్ తేజ్ మెరిసిపోయారు. లావణ్య పసుపు కలర్ లెహంగా ధరించగా, వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంట్ ధరించారు.  ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. 
Varun Tej_lavanya
Varun Tej_lavanya
 
ఈ ఫోటోల్లో మెగాస్టార్ చిరంజీవి హైలైట్‌గా నిలిచారు. ఆయన లుక్ భలేగుంది. 25 ఏళ్ల కుర్రాడిలా మెగాస్టార్ పసుపు రంగు దుస్తుల్లో భలే అనిపించాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వీరిద్దరు వీరిద్దరూ కూడా పసుపు వర్ణంలోనే దుస్తులను ధరించారు. 
 
డార్క్ ఎల్లో కలర్ కుర్తాలో బ్లాగ్ గాగుల్స్‌తో ఒక ఛైర్‌లో కూర్చుని మెగాస్టార్ కనిపించారు. ఈ సిట్టింగ్ స్టైల్ మెగా ఫ్యాన్సును ఆకట్టుకుంటోంది. ఈ స్టైల్ అద్భుతమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
Varun Tej_lavanya
Varun Tej_lavanya
 
ఇకపోతే.. నవంబర్ 1న వరుణ్- లావణ్యల వివాహం ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఇరువురి కుటుంబసభ్యులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు ఇటలీ చేరుకున్నారు.

Haldi
Haldi