శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:20 IST)

మెహందీ, కాక్‌టెయిల్ పార్టీతో వరున్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెండ్లి సందడి ఆరంభమైంది

nagababu, lavnay in italy
nagababu, lavnay in italy
తమ గ్రాండ్ వెడ్డింగ్ వేడుక కోసం ఇటలీలోని బోర్గో శాన్ ఫెలిస్‌కి వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల కుటింబీకులు చేరుకున్నారు. దీంతో పెండ్లి సందడి మొదలైంది. నిన్న ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఇటలీలో జరిగింది. అందుకు ఆహ్వానపత్రిక కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వేడుకలకు పరిమిత సభ్యులు హాజరు అయినట్లు తెలియవచ్చింది.

wedding invitation
wedding invitation
ఇతర ఆచారాలు ఈరోజు ప్రారంభమవుతాయి. నవంబర్‌ 1న ఇటలీలో వివాహం జరుగుతున్నట్లు వెల్లడించారు. అనంతరం హైదరాబాద్‌లో నవంబర్‌ 5న మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెక్షన్‌ సెంటర్‌లో ఫిలిం ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో రిసెప్షన్‌ జరగనున్నది.
 
Varun, lavanya
Varun, lavanya
ఇటలీ వేడుకకు ముందు నాగబాబు ఫ్యామిలీని లావణ్య స్నేహితులు కలిసి వున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే చిరంజీవి కుటుంబం కూడా అక్కడకు హాజరయ్యారు. సహజంగా హీరోహీరోయిన్లు కలిసి నటించిన సినిమాల్లోనే ప్రేమ వ్యక్తం అవుతుంటాయి. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన మిస్టర్‌ మూవీలో నటించారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. కాగా, అక్టోబర్‌ 31న అనగా నేడు హల్దీ, మెహందీ, కార్యక్రమాలు జరుగుతున్నాయి.