గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (13:54 IST)

స్నేహారెడ్డి అక్కకు థ్యాంక్స్‌ చెప్పిన వరుణ్‌ తేజ్‌ దంపతులు

Varuntej-lavanya with chiru family
Varuntej-lavanya with chiru family
మెగా కుటుంబంలో నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్‌ వివాహం గురించి తెలిసిందే. లావణ్య త్రిపాఠితో నవంబర్ 1న పెండ్లి జరగనున్నదని అభిమానులకు ఎరికే. ఈ ఈఏడాది జూన్‌ 9న నిశ్చితార్తం కూడా జరిగింది. ఆ తర్వాత ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. ఇక ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి తన స్వగృహంలో కుటుంబసభ్యులు, పరిమిత సభ్యుల సమక్షంలో పార్టీ చేశారు.

Varun-lavanya,all arjun family
Varun-lavanya,all arjun family
తాజాగా మొన్న అల్లు అర్జున్‌ కూడా ప్రీ వెడ్డింగ్‌ పార్టీ చేశారు. ఇందుకు స్నేహారెడ్డి కార్యక్రమాలు చూసుకుంది. ఈ పార్టీలో హీరో నితిన్‌, రీతూవర్మ కూడా కనిపించడం విశేసం. అదెలాగంటే వరుణ్‌ ఫ్రెండ్‌ నితిన్‌, రీతూవర్మ ఫ్రెండ్‌ లావణ్య. సో. వీరితోపాటు మరికొంతమంది ముఖ్యులు హాజరయ్యారు.

Varun-lavanya,all arjun family
Varun-lavanya,all arjun family
ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌.. స్నేహాఅక్కకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశాడు. మా కోసం అద్భుతమైన సాయంత్రం హోస్ట్ చేసినందుకు బన్నీ, స్నేహ అక్కకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి అవార్డు వేడుకలో అల్లు అర్జున్‌ అవార్డు అందుకోనున్నారు.