ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 మే 2016 (13:11 IST)

సమంత కొడుకుతో హాయిగా నిద్రపోయింది.. ట్విట్టర్లో ఫోటోలు.. వెల్లువెత్తిన ట్వీట్స్!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు పిల్లలంటే చాలా ఇష్టం. అదీ తన స్నేహితురాలు నీరజ కోన కుమారుడిని తన కుమారుడిగానే సమంత భావిస్తోంది. సమంత నీరజ కోన కుమారుడితో గతంలో తీసుకున్న ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తాజాగా సమంత నీరజ కోన కుమారుడితో కలిసి నిద్రపోయిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. సమంతాకి నీరజ కోన మంచి స్నేహితురాలు. ఆమెకి ఒక బుడ్డ బాబు ఉన్నాడు. ఆ బుడ్డోడు అంటే.. సమంతకి ఎంతో ఇష్టం. దీనితో ఆ బుడ్డోడుని ఎత్తుకొని.. చాలా సేపు ఆడించి, ముద్దు చేసింది. చివరికి అలసిపోయి నిద్రపోయింది. అలాగే ఆ బుడ్డోడు కూడా నిద్రపోయాడు. ఈ తతంగాన్నంతా నీరజ కోన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు ఆమె అభిమానులను ఓ ప్రశ్న వేశారు. ఎవరు ఎవరిని నిద్రపుచ్చారని ప్రశ్నించారు. ఇంతకీ ఎవరు ఎవరిని నిద్రపుచ్చారంటారు? అంటూ అభిమానులను నీరజ అడిగింది. దీనికి ఆమె అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. కామెంట్లతో సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు.