ప్రియుడిపై మోజు.. వ్యతిరేకించాడనీ తమ్ముడినే కడతేర్చిన నటి!

shanaya katwe
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (21:29 IST)
కన్నడ నటి షనాయా కాట్వే దారుణానికి తెగబడింది. ప్రియుడి మోజులో పడి సొంత తమ్ముడినే కడతేర్చింది. ఇపుడు పోలీసులకు చిక్కి.. జైలు ఊచలు లెక్కిస్తోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షనాయా కాట్వే గత కొంతకాలంగా సినీ తారల మేనేజర్ నియాజ్ అహ్మద్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. ఈ ప్రేమను ఆమె సోదరుడు రాకేశ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. నియాజ్ అహ్మద్‌కు దూరంగా ఉండాలని పలుమార్లు హెచ్చరించాడు.

అయితే, అప్పటికే ప్రియుడి మోజులో నిండా మునిగిపోయిన షనాయాకు తమ్ముడి మాటలు ఏమాత్రం రుచించలేదు. పైగా, తనకు పదేపదే హెచ్చరికలు చేస్తుండటం ఏమాత్రం రుచించలేదు. ఈ విషయాన్ని తన ప్రియుడు నియాజ్‌కు చెప్పింది. తమ ప్రేమకు రాకేశ్ మున్ముందు అడ్డు తగులుతాడని భావించి అతడ్ని హత్య చేయడానికి పథక రచన చేశారు.

ఈ క్రమంలో నియాజ్, అతడి గ్యాంగ్... రాకేశ్‌ను అంతమొందించి అతడి మృతదేహాన్ని కారులో దాచారు. అయితే ఆ మృతదేహం కుళ్లి వాసన వస్తే దొరికిపోతామని భావించి, రాకేశ్ మృతదేహాన్ని ఖండఖండాలుగా నరికి హుబ్బళ్లి పరిసర ప్రాంతాల్లో విసిరేశారు.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది నియాజ్ అని గుర్తించారు. ఈ హత్య వెనుక రాకేశ్ సోదరి షనాయా కాట్వే ఉందని తెలుసుకుని ఆమెను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


దీనిపై మరింత చదవండి :