బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (13:31 IST)

ఆ డైరక్టర్ నన్ను డైరక్టర్ చేయాలని చూశాడు.. మాయ కూడా?: పూనమ్ కౌర్

సినీ నటి పూనమ్ కౌర్ ఓ దర్శకుడిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డైరక్టర్ వున్నాడని.. ఆయన సినిమాలనే కాకుండా.. మనుషులను కూడా డైరక్ట్ చేస్తుంటాడని.. తనను కూడా డైరక్ట్ చేయాల

సినీ నటి పూనమ్ కౌర్ ఓ దర్శకుడిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డైరక్టర్ వున్నాడని.. ఆయన సినిమాలనే కాకుండా.. మనుషులను కూడా డైరక్ట్ చేస్తుంటాడని.. తనను కూడా డైరక్ట్ చేయాలని చూశాడు. అందులో భాగంగా మాయ కూడా చేశాడని పూనమ్ కౌర్ వెల్లడించింది. ఈ విషయంపై అడిగితే ఏమీ తెలియనట్లు నటించాడని పూనమ్ కౌర్ తెలిపింది. 
 
ఇంకా ఆయనకు సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో వుండాలని కోరుకుంటాడని పూనమ్ ట్వీట్‌లో పేర్కొంది. కానీ ఆ డైరక్టర్ ఎవరని మాత్రం పూనమ్ కౌర్ వెల్లడించలేదు. దాంతో పూనమ్ ఎవరి గురించి ఇలా ట్వీట్ చేసిందనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ మొదలైంది. 
 
ఇదిలా ఉంటే, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న నేపథ్యంలో సినీతారలు కూడా దానిపై తమకు ఎదురైన చేదు అనుభవాలను పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇదే తరహాలో సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వుందని తాను ఎప్పుడో చెప్పానని నికీషా తెలిపింది. అవకాశాలు కావాలంటే పడకగదికి రావాలంటూ కొందరు బహిరంగంగానే అడుగుతారని చెప్పింది. ఇది అన్ని రంగాల్లో జరుగుతున్నదే అయినప్పటికీ... సినీరంగం కాబట్టి ఎక్కువ ప్రచారం జరుగుతోందని తెలిపింది.