శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 జులై 2017 (09:55 IST)

ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలనే ఆలోచన విరమించుకోండి... ప్లీజ్ : పోసాని

స్వర్గీయ ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలన్న ఆలోచన విరమించుకోవాలని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కోరారు. ఈ మేరకు ఆయన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు విజ్ఞప్తి చేశారు.

స్వర్గీయ ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలన్న ఆలోచన విరమించుకోవాలని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కోరారు. ఈ మేరకు ఆయన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై పోసాని కృష్ణమురళి స్పందించారు. 
 
'రాము గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.. ఎన్టీఆర్ పై బయోపిక్ తీయాలనే ఆలోచనను విరమించుకుంటే మంచిదని చెబుతున్నాను' అని పోసాని చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. బయోపిక్ తీస్తే కనుక, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిందేనని, వ్యక్తిగత జీవితం ముట్టుకోకుండా సినిమా తీయలేరని, నందమూరి కుటుంబసభ్యులను బాధపెట్టడం ఎందుకు? బయోపిక్ తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.