1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 మే 2017 (16:36 IST)

అమరేంద్ర బాహుబలిగా పవన్ కల్యాణ్... ప్రభాస్ ఫోటోలో పవర్ స్టార్.. పాజిటివ్ టాక్..

బాహుబలి 2 ద్వారా అమరేంద్ర బాహుబలిగా ప్రభాసే కరెక్ట్ అనే ప్రశంసలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అమరేంద్ర బాహుబలిగా మరో టాప్ హీరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో అమరేంద్ర బాహుబలిగా

బాహుబలి 2 ద్వారా అమరేంద్ర బాహుబలిగా ప్రభాసే కరెక్ట్ అనే ప్రశంసలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అమరేంద్ర బాహుబలిగా మరో టాప్ హీరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో అమరేంద్ర బాహుబలిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. బాహుబలి 2 పోస్టరును మార్ఫింగ్ చేస్తూ.. ప్రభాస్ తల స్థానంలో పవన్ కల్యాణ్ ఫోటోను పెట్టారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యింది. 
 
బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలో అమరేంద్ర బాహుబలిగా గడ్డం పెంచుకుని ఉన్నాడు పవన్ కల్యాణ్. ఈ లుక్‌లో పవన్ లుక్ ప్రభాస్ లుక్ మ్యాచ్ అయ్యిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఫిలిం నగర్ జనం మాత్రం అమరేంద్ర బాహుబలిగా పవన్ కల్యాణ్ ఏమాత్రం సరిపోడని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అమరేంద్ర బాహుబలిగా పవన్ మార్ఫింగ్ ఫోటోకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ రాలేదు.