శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 16 ఫిబ్రవరి 2017 (04:34 IST)

బాహుబలి 2లో షారుక్ కామియోనా? పగలబడి నవ్వుకుంటున్న ప్రభాస్

దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంటున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ రెండు నెలలకు ముందే పూర్తయి గుమ్మడి కాయ కొట్టేసినా ఇంకా షూటింగ్ జరుగుతున్నట్లుగా రూమర్లు వస్తూనే

దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంటున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ రెండు నెలలకు ముందే పూర్తయి గుమ్మడి కాయ కొట్టేసినా ఇంకా షూటింగ్ జరుగుతున్నట్లుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోకి తాజాగా షారుక్ కూడా చేరిపోయాడు. 

ఏమంటే బాహుహలి-2లో బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక కామియో పాత్రలో నటిస్తున్నాడని రూమర్ల మీద రూమర్లు వచ్చేసాయి. ఇవి బాహుబలి హీరో ప్రభాస్‌కు కూడా చేరాయి. ఈ రూమర్లను విని హాయిగా నవ్వుకున్న ప్రభాస్ తర్వాత వాటిని ఉత్తుత్తివిగా తోసిపుచ్చాడు. షారుఖ్ బాహుబలి2 లో భాగం కాదని తేల్చి చెప్పేశాడు. 
 
బాహుబలి పర్యాయపదంగా మారిన ప్రభాస్ ఈ సినిమా అంత పెద్ద బ్రాండ్ సినిమా కాబట్టే నిత్యం దానిపై ఎవరో ఒకరు ఏదో ఒకరకంగా వార్తలు, పుకార్లు, అంచనాలు వదులుతూనే ఉన్నారని, అయితే అవి తనను ఏమాత్రం బాధపెట్టకపోగా బాగా నవ్విస్తున్నాయని చెప్పాడు. 
 
భారతీయ చిత్రపరిశ్రమకు భారీతనం కాదు అతిభారీతనం అంటే ఏమిటో చూపించిన బాహుబలి తన విజువల్ వండర్‌తో ప్రపంచాన్నే మంత్రముగ్ధను చేసింది. దీంతో బాహుబలి2 కోసం కోట్లమంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కూడా. తొలి భాగం కంటే మలిభాగం ఇంకా భారీతనంతో కూడుకుని ఉంటుందని రాజమౌళి చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
 
తొలిభాగంలో సింగిల్‌గానే ఉన్న ప్రభాస్ రెండో భాగంలో ద్విపాత్రాభినయం చేయడమే కాక ప్రేమ, సాహసోపేతమైన యాక్షన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడని తెలియడంతో ఏప్రిల్ 28న విడుదల కానున్న బాహుబలి 2 అశేష ప్రేక్షకులను ఉత్కంఠ భరితులను చేస్తోంది. దీంతో ఈ సినిమాపై ఎలాంటి రూమర్ వచ్చినా నిజమేనేమో అనిపిస్తోంది. షారుఖ్ కామియో కూడా దీంట్లో భాగమే.