శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 12 జూన్ 2024 (14:57 IST)

అంబర్ పేట్ శంకరన్న ఆవిష్కరించిన ప్రణయ గోదారి టైటిల్

Pranaya Godari team with Amber Pate Sankaranna
Pranaya Godari team with Amber Pate Sankaranna
ప్రముఖ కమీడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై  పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ఈ చిత్రానికి పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకరన్న ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రాలకు సినీ పరిశ్రమలోని అందరూ అండగా నిలువాలి. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. నిర్మాతగా పారమళ్ల లింగయ్యకు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్‌తో పాటు, డబ్బులు కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.. 
 
 నిర్మాత పారమళ్ళ లింగయ్య మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన అంబర్ పేట్ శంకరన్న ‘ప్రణయ గోదారి’ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అందరూ ఆదరించి మా చిత్రాన్ని పెద్ద హిట్ చేయాల’ని కోరారు. 
 
ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్  హీరోయిన్ గా, ఇతర కీలక పాత్రలలో సాయికుమార్, 30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల తదితరులు నటిస్తున్నారని తెలిపారు. 
 
దర్శకుడు పి.ఎల్.విఘ్నేష్  రూపొందించిన ఈ సినిమాకు మార్కండేయ సంగీత దర్శకుడిగా..  ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా వ్యవహరించారు.
 
ఈ కార్యక్రమంలో యాదయ్య గౌడ్, కాలే రమేష్, వరికుప్పల వెంకట్ రాములు(వీవీఆర్) నాగుల ఆనంద్ కుమార్ నేత, గోదాస్ జగన్, పసుల లక్ష్మయ్య, చిన్నోళ్ల రాజశేఖర్, శివ, మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్,30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల  తదితరులు
 
సాంకేతిక బృందం
బ్యానర్ : పిఎల్‌వి క్రియేషన్స్‌
నిర్మాత : పారమళ్ళ లింగయ్య
దర్శకుడు : పి ఎల్ విఘ్నేష్
సంగీత దర్శకుడు : మార్కండేయ
కెమెరామెన్ : ఈదర ప్రసాద్
కొరియోగ్రాఫర్ : కళాధర్,మోహనకృష్ణ, రజిని
ఫైట్ మాస్టర్ : శంకర్ ,అహ్మద్
అస్టెంట్ డైరెక్టర్ : గంట శ్రీనివాస్
పీఆర్ఓ : ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
 
హీరో విశ్వక్‌ సేన్ చేతుల మీదగా విడుదలైన పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ట్రైలర్
 
 
వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై  కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా  తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా రిలీజైన ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రైలర్ చాలా బాగుందని ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే విధంగా ఉందని తెలిపారు. సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది ఓ సాహసమని ఆ విషయంలో చిత్ర నిర్మాత  కే. ఓ. రామరాజు విజయం సాధించారు అని, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు.  
 
చిత్రంలో నటించిన హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్‌, హీరోయిన్స్ శశికా టిక్కో, అశురెడ్డి లకు ప్రత్యేక విషెస్ చెప్పారు. అలాగే చిత్రంలో నటించిన మిగితా నటీనటులకు, టెక్నిషియన్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమాను ప్రేక్షకులు ఆదరించి, విజయవంతం చేయాలని కోరారు. ట్రైలర్ లో చూపించినట్లు ఫస్ట్‌లవ్‌లో ఫెయిల్‌ అయిన వ్యక్తి అదే ధ్యాసలో ఉంటూ వేదన పడుతాడని, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేదాన్ని.. ఎంతో ఆసక్తితో అన్ని హంగులు సమపాలల్లో ఉండేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ జూన్ 21న ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అయింది. కచ్చితంగా చిత్రం మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.