శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (09:30 IST)

మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి: రాజశేఖర్ కుమార్తె శివాత్మిక

జీవితారాజశేఖర్ దంపతులతో పాటు వారి పిల్లలకు కూడా కరోనావైరస్ సోకిన విషయం తెలిసిందే. ఐతే కరోనా నుంచి పిల్లలు బయటపడ్డారు. జీవిత కూడా కోలుకున్నారు. ఐతే రాజశేఖర్ మాత్రం కోవిడ్ వైరస్ తో పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కుమార్తె శివాత్మిక ట్విట్టర్ వేదికగా ఇలా రాసారు.
 
" ప్రియమైన అందరికి... కోవిడ్‌తో నాన్న పోరాటం చాలా కష్టంగా వుంది, అయినప్పటికీ ఆయన దానితో గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనల ప్రేమ మరియు దీవెనలు మమ్మల్ని రక్షిస్తున్నాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను! మీ ప్రేమతో, ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు"