''ప్రేమమ్'' ఆడియోకు అదిరే గెస్ట్ ఎవరో తెలుసా? సమంత మెరుస్తుందా..?
''ప్రేమమ్'' ఆడియోకు పండుగకు ముహూర్తం కుదిరింది. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మే
''ప్రేమమ్'' ఆడియోకు పండుగకు ముహూర్తం కుదిరింది. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మేరకు హీరో అక్కినేని నాగచైతన్య ఆడియోకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘ప్రేమమ్’కి రీమేక్‌గా అదే టైటిల్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఊపిరి ఫేమ్ గోపీసుందర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. 20న జరిగే ఆడియో రిలీజ్‌కి స్పెషల్ గెస్ట్‌ని ప్లాన్ చేసింది అక్కినేని కుటుంబం. ఆయన ఎవరో కాదు.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. ఓ మెగా హీరో అక్కినేని సినిమా ఆడియోకి రావడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
గతంలో అల్లు అర్జున్ ఫాదర్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. నాగచైతన్యతో 100 % లవ్ సినిమా చేశాడు. చైతు కెరీర్‌లో ఇది బిగ్ హిట్. ఈ అనుబంధంతోనే చైతు సినిమాకి బన్నిని గెస్ట్‌గా ఆహ్వానించినట్లు సమాచారం. మరోవైపు, ఈ మూవీ ఆడియో వేదికపై సమంత మెరుస్తుందా? లేదా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.