వరుణ్ తేజ్ ''మిస్టర్''లో ప్రిన్స్.. మహేష్ బాబా? హెబ్బా పటేల్‌తో రొమాన్స్ చేస్తాడా?
వరుణ్ తేజ్ సినిమాలో ప్రిన్స్ కనిపించబోతున్నాడట. నిజమా.. గెస్ట్ రోలా.. లేకుంటా మల్టీస్టారర్ సినిమానా అని అడుగుతున్నారు కదూ.. అదేంలేదు. ప్రిన్స్ అంటే ఇక్కడ టాలీవుడ్ అందాల హీరో మహేష్ బాబు కాదు. బస్టాప్ స
వరుణ్ తేజ్ సినిమాలో ప్రిన్స్ కనిపించబోతున్నాడట. నిజమా.. గెస్ట్ రోలా.. లేకుంటా మల్టీస్టారర్ సినిమానా అని అడుగుతున్నారు కదూ.. అదేంలేదు. ప్రిన్స్ అంటే ఇక్కడ టాలీవుడ్ అందాల హీరో మహేష్ బాబు కాదు. బస్టాప్ సినిమాలో ఆకట్టుకున్న ప్రిన్స్. వరుణ్ తేజ్-శ్రీనువైట్ల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ''మిస్టర్''. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు.
ఇటీవలే చిత్రబృందం షూటింగ్ కోసం స్పెయిన్ అక్కడ నెల రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరిపింది. ప్రస్తుతం కర్ణాటక-మంగుళూరులో షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో యంగ్ హీరో ప్రిన్స్ జాయిన్ అయ్యారు. "బస్టాప్" సినిమాలో ఆకట్టుకున్న ప్రిన్స్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ప్రిన్స్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని సమాచారం. ఇకపోతే, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. కాగా ప్రిన్స్ హెబ్బా పటేల్‌తో రొమాన్స్ చేయనున్నాడని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.