సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 21 మే 2020 (23:41 IST)

నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి 11 లక్షలు కరోనా సాయం..

వలస కార్మికులు ఎంతోమంది పొట్ట చేత పట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది వారి ఉపాధి కోల్పోయి సొంత ఊళ్ల బాట పట్టారు. అలాంటి వారిలో కొంతమందికైనా సాయం చేసే ఉద్ధేశ్యంలో ‘త్రిపుర’ చిత్ర నిర్మాత రాజశేఖర్‌ ముందుకొచ్చి తన వంతు సాయాన్ని అందించారు.
 
వలస కార్మికులు కాలినడకన, లారీల్లో ఎలా అవకాశముంటే అలా వారి ప్రాంతాలకు వెళుతున్నారు. అలా వెళ్లే వాళ్లను చూసిన నిర్మాత యం.రాజశేఖర్‌ రెడ్డి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్లకు ఎంతో కొంత ఆసరాగా ఉండే ఉద్దేశ్యంతో సోమవారం ఒరిస్సా, చత్తీస్‌గడ్‌ వెళ్లేవారికోసం 400 ప్యాకెట్ల పులిహోర, బిస్కట్స్, మంచినీళ్లు, చెప్పులు, మెడిసిన్‌ అందచేశారు.
 
మంగళ, బుధవారాల్లో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వెళ్లే వారికోసం దాదాపు 600 టమాట రైస్‌ తయారు చేయించారు.
 
సొంత ఊళ్లు వెళ్లటానికి చార్జీలకు డబ్బులు లేనివారికి 40, 000 రూపాయలను ఇచ్చి ఆదుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ సీయం రిలీఫ్‌ ఫండ్‌కు 5లక్షలు అందించిన రాజశేఖర్‌ వలస కార్మికుల కోసం మరో లక్ష రూపాయాలను ఖర్చు చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ను తమిళంలో ‘కేరాఫ్‌ కాదల్‌’గా తీశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్‌’ చిత్రాన్ని తమిళ్, తెలుగులో నిర్మిస్తున్నారు.