శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (19:22 IST)

కరోనా దెబ్బకు సినీ ప్రపంచం ఎలా వుంటుందంటే?: నిర్మాత షాకింగ్ కామెంట్స్

లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినీ ప్రపంచం ఎలా వుంటుందని బాహుబలి నిర్మాత స్పందించారు. ప్రస్తుతం శోభూ యార్లగడ్డ నిర్మిస్తున్న తాజా చిత్రం ''ఉమామహేశ్వర ఉగ్రరూపస్య''. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది. 
 
ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాబోయే సినిమా రిలీజ్‌కి సంబంధి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సంచలన కామెంట్స్ చేశారు. కరోనా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ మన అదృష్టం బాగుండి కరోనా ముగిస్తే.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో గతంలోని పరిస్థితులు ఫిల్మ్ మార్కెటింగ్ కుదరక పోవచ్చని అభిప్రాయపడ్డారు.
 
ఇంకా తన అభిప్రాయాలను యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ తర్వాత ఫిల్మ్ మార్కెటింగ్ ఎలా ఉండబోతోంది ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెటింగ్ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నానని వెల్లడించారు. 
 
ప్రీ-రిలీజ్ వేడుకలు ఆడియో విడుదల కార్యక్రమాలు థియేటర్స్ మాల్స్కు వెళ్లడం రోడ్ ట్రిప్లు.. ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాలను నిర్వహించడం కుదరదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయని తెలిపారు.