శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 మే 2020 (12:54 IST)

కరోనాను మోసుకొచ్చిన కూరగాయలు.. ఏపీలో కొత్తగా 68 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు సంఖ్య మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరో 68 కొత్త కేసులు కూడా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,159 శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, కర్నూలులో ఒకరు మృతి చెందారని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,407 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 53కి చేరింది.
 
కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 పాజిటివ్ కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న కేసులు కావడం గమనార్హం. గత 10 రోజుల్లో 59 పాజిటివ్ కేసులు ఈ మార్కెట్‌కు వెళ్లివచ్చినవారివే కావడం గమనార్హం. ముఖ్యంగా, నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటలో చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న వారికి ఈ వైరస్ సోకింది.