బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (13:18 IST)

జూమ్‌కాల్ ద్వారా సుప్రీం కోర్టు విచారణ.. డ్రగ్ స్మగర్లకు మరణశిక్ష

జూమ్‌కాల్ ద్వారా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇంకా ఓ డ్రగ్ స్మగ్లర్‌కు సింగపూర్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. మలేషియాకు చెందిన 37 ఏల్ల పునీతన్ గనేశన్ అనే వ్యక్తి 2011లో హెరాయిన్ సరఫరా చేశాడు. ఆ కేసులో సుప్రీం విచారణ సాగింది. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా.. దేశంలోని కోర్టులన్నీ మూతపడ్డాయి. 
 
కొన్ని కోర్టులు మాత్రం వీడియో కాలింగ్‌తో కేసులను పరిష్కరిస్తున్నాయి. అలాగే స్మగ్లర్ పునీతన్ కేసును కూడా విచారించిన కోర్టు.. నిందితుడికి మరణశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. జూమ్‌కాల్ ద్వారా తీర్పు విన్నానని, దీనిపై అపీల్‌కు వెళ్లనున్నట్లు పునీతన్ తరపు న్యాయవాది తెలిపారు.
 
సింగపూర్‌లో ఒక వ్యక్తికి ఆ దేశ సుప్రీంకోర్టు జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉరిశిక్ష విధించింది. కరోనా నేపథ్యంలో సింగపూర్‌ దేశం లాక్‌డౌన్‌లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపుర్‌ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన 37 ఏళ్ల పునితాన్ జెనాసన్ 2011లో హెరాయిన్‌ డ్రగ్‌ను అక్రమంగా సరఫరా చేయడంపై అప్పట్లో అతనిపై కేసు నమోదయింది. ఈ మేరకు అప్పటి నుంచి విచారణ జరుగుతున్న ఈ కేసులో అక్రమంగా డ్రగ్‌ సరఫరా చేస్తున్నాడనేదానిపై పునితాన్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది.