సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (18:57 IST)

కరోనా కాలర్ ట్యూన్ల వెనుక వున్న అసలు రహస్యం.. ఆ వాయిస్ ఎవరిదంటే?

కరోనా కాలర్ ట్యూన్ల వెనుక ఉన్న అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది. కరోనా కాలర్ ట్యూన్లు, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో ద్వారా ఈ గొంతు ఎవరిదనే వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన ఇద్దరు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులతో ఈ కాలర్ ట్యూన్లను రికార్డు చేశారు. 
 
దేశంలో కరోనా కలకలం మొదలైన మార్చి మొదటి వారంలో కాలర్ ట్యూన్లలో మొదట దగ్గు వినిపించి తర్వాత ఓ స్వరం వినిపించేది కదా అది దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన జెస్సీకా ఫెర్నాండెజ్ తన వాయిస్‌గా పెర్కొన్నారు. దగ్గుతో మొదలయ్యే కాలర్ ట్యూన్ జెస్సీకా స్వరం కాగా.. మిగతా రెండు ట్యూన్లకు విద్య నారాయణ్ భట్ డబ్బింగ్ చెప్పారు.
 
దీనిపై జెస్సికా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. ఢిల్లీ స్టూడియో నుంచి తనకు ఫోన్‌ వచ్చినప్పుడు.. త్వరలోనే తన స్వరం కాలర్‌ ట్యూన్‌గా వినిపించబోతుందన్న సంగతి అంతగా తెలియదన్నారు. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నా స్వరం మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్‌గా వినిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే ఢిల్లీ స్టూడియోకి ఫోన్ చేసి నా పేరు వెల్లడించవద్దని కోరినట్లు తెలిపారు.
 
పదే పదే తన స్వరం వింటే వినియోగదారులకు విసుగెత్తి ట్రోల్ చేస్తారని ఇన్నాళ్లూ దాచిపెట్టానని జెస్సికా తెలిపింది. ఎవరో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో తన పేరు బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు ట్రోలింగ్స్‌తో పాటు తనకు ప్రశంసలు కూడా అంతే స్థాయిలో అందుతున్నాయని జెస్సికా ఫెర్నాండెజ్ చెప్తున్నారు.