సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (16:21 IST)

57 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం విక్రయం

తిరుమలలో 57 రోజుల తర్వాత శ్రీవారి ప్రసాద విక్రయాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అలాగే, శ్రీవారి ప్రసాదాలను కూడా భక్తులకు విక్రయించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 57 రోజుల సుధీర్ఘ విరామ తర్వాత శ్రీవారి ప్రసాదాలు విక్రయించారు. 
 
ఈ ప్రసాదాల విక్రయం కోసం శ్రీనివాస కళ్యాణం, తితిదే పరిపాలనా భవనంలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. కాగా, 500 పెద్ద లడ్డూలు, వడ ప్రసాదం విక్రయించాలని తితిదే నిర్ణయించింది. అయితే, చిన్న లడ్డూలకు డిమాండ్ ఏర్పడితే వాటిని కూడా విక్రయించారని నిర్ణయించారు. శ్రీవారి హుండీ తర్వాత లడ్డూల విక్రయాల వల్లే ఎక్కువ ఆదాయం వచ్చింది.