శ్రీవారి దర్శనానికి తితిదే కార్యాచరణ సిద్ధం...
కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు (తితిదే) పాలక మండలి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్‌ను ఎత్తివేసినపక్షంలో శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించాలన్న ప్రతిపాదనలో ఉంది.
తితిదే వర్గాల సమాచారం మేరకు... లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించాలన్న ఆలోచనలో ఉంది. ఇందుకోసం సామాజిక భౌతికదూరం పాటిస్తూ ఈ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది.
అలాగే, ప్రసాదం పంపిణీ కౌంటర్ల వద్ద, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయాన్ని మాత్రం కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే తెరుస్తారు.