గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 5 మే 2020 (23:39 IST)

వేంకటేశ్వరుని కోసం మేల్ ఛాట్ వస్త్రాలు కొనుగోలు చేశారు, ఎలా సాధ్యం?

తిరుమల శ్రీవారికి అలంకరించేందుకు 8మేల్ ఛాట్ వస్త్రాలను సేలం నుంచి కొనుగోలు చేశామని, జూన్ నెల వరకు ఇవి సరిపోతాయని తిరుమల టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన సేలంలోని తయారీదారుల నుంచి మేల్ ఛాట్ వస్త్రాలు కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు.
 
శ్రీవారి మూలమూర్తికి అలంకరించేందుకు ప్రత్యేక కొలతలతో ఈ చీరను తయారు చేస్తారని చెప్పారు. సేలంలో మాత్రమే మేల్ ఛాట్ వస్త్రాలను తయారుచేస్తారని, తయారీదారులు ఎంతో నియమనిష్టలతో ఈ పట్టువస్త్రాన్ని రూపొందిస్తారన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో సేలంలో సిద్థమైన 8మేల్ ఛాట్ వస్త్రాలను తిరుమలకు తీసుకురావడం కష్టతరంగా మారిందని చెప్పారు.
 
అయితే టిటిడి బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి చొరవతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి డిజిపి అనుమతులు తీసుకుని సేలం నుంచి ఈ వస్త్రాలను తిరుమలకు తీసుకొచ్చారని అదనపు ఈఓ తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్సనం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రస్తుతం 2మేల్ ఛాట్ వస్త్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో టెండరు ద్వారా 8మేల్ ఛాట్ వస్త్రాలను టిటిడి కొనుగోలు చేసింది.