ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 మే 2017 (21:23 IST)

'వైశాఖం' సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది: డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌

వైశాఖం చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆయన బుధవారం ఆర్‌.జె. సినిమాస్‌ కార్యాలయానికి విచ్చేసి 'వైశాఖం' పాటల్ని ప్రత్యేకంగా వీక్షించి

వైశాఖం చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఆయన బుధవారం ఆర్‌.జె. సినిమాస్‌ కార్యాలయానికి విచ్చేసి 'వైశాఖం' పాటల్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించారు. హరీష్‌, అవంతిక జంటగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం జూన్‌ ఫస్ట్‌వీక్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇటీవల హైదరాబాద్‌లోని ఆర్‌.జె. సినిమాస్‌ కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి 'వైశాఖం' చిత్రంలోని పాటల్ని, ట్రైలర్‌ని వీక్షించారు. 
 
డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ''జయగారు ఎప్పుడు సినిమా తీసినా పిలిచి ఆ సినిమాలోని సాంగ్స్‌, ట్రైలర్‌ చూపిస్తుంటారు. రాజుగారు, జయగారు మా ఫ్యామిలీ మెంబర్స్‌లాగ. 'వైశాఖం' సాంగ్స్‌ చూశాను. చాలా బాగున్నాయి. వసంత్‌ చాలా బాగా మ్యూజిక్‌ చేశాడు. కొరియోగ్రఫీ చాలా బావుంది. హీరో హరీష్‌, హీరోయిన్‌ అవంతిక ఫుల్‌ ఎనర్జిటిక్‌గా పోటీపడి చేశారు. ఇద్దరికీ మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలి. వాలిశెట్టి సుబ్బారావు ఫొటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. లొకేషన్స్‌ అన్నీ చాలా కొత్తగా, రిచ్‌గా ఉన్నాయి. విజువల్స్‌ అన్నీ బ్యూటిఫుల్‌గా వున్నాయి. సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు. 
 
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ... ''లవ్‌లీ' సాంగ్స్‌ చూసి పూరి జగన్నాథ్‌ మమ్మల్ని అప్రిషియేట్‌ చేశారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ని కూడా అప్రిషియేట్‌ చెయ్యడమే కాకుండా తన నెక్స్‌ట్‌ సినిమాకి మ్యూజిక్‌ చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వైశాఖం' సాంగ్స్‌ చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యారు. ప్రతి పాట దేనికదే ప్రత్యేకంగా కొత్తగా వుందన్నారు. 
 
పూరిలాంటి పెద్ద డైరెక్టర్‌ మా ఆఫీస్‌కి వచ్చి సాంగ్స్‌ చూసి మమ్మల్ని అభినందించడం నిజంగా పెద్ద విజయం సాధించినట్టుగా ఫీలవుతున్నాం. పూరిగారు ఎలా ఫీలయ్యారో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌ కూడా అలాగే ఫీల్‌ అవుతారని నా నమ్మకం. పూరి సాంగ్స్‌ చూసి ఆ విజువల్స్‌ బ్యూటీకి, కొత్తదనానికి చాలా ఇంప్రెస్‌ అయ్యారు. విజువల్స్‌ అన్నీ చాలా గ్రాండియర్‌గా వున్నాయి. నేను కూడా ఇలా కొత్త లొకేషన్స్‌లో చెయ్యాలి అని ఆయన కూడా ఇన్‌స్పైర్‌ అయ్యారు. ఆయన్ని ఇన్‌స్పైర్‌ చేసేంతగా 'వైశాఖం' సాంగ్స్‌ వుండటం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను'' అన్నారు. 
 
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. ''పూరి జగన్నాథ్‌ మా 'వైశాఖం' సాంగ్స్‌ చూసి చాలా చాలా బాగున్నాయి అని చెప్పడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. పూరిగారి జడ్జిమెంట్‌ ఎప్పుడూ కరెక్ట్‌గా వుంటుంది. 'లవ్‌లీ' సాంగ్స్‌ చూసి సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది అని చెప్పారు. అలాగే ఇప్పుడు 'వైశాఖం' సాంగ్స్‌ చూసిన వెంటనే ఈ సినిమా సూపర్‌హిట్‌ గ్యారెంటీ అవుతుందని చెప్పడం మాకెంతో బలాన్ని ఇచ్చింది. డెఫినెట్‌గా పూరిగారు చెప్పినట్టు ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ కాబోతోంది. జూన్‌ ఫస్ట్‌వీక్‌లో 'వైశాఖం' చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
హీరో హరీష్‌ మాట్లాడుతూ... ''వైశాఖం'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. పూరి మా 'వైశాఖం' సాంగ్స్‌ చూసి చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఆయనది గోల్డెన్‌ హ్యాండ్‌ అని మా టీమ్‌ ఎప్పుడూ చెప్తుంటారు. 'లవ్‌లీ' సినిమా సాంగ్స్‌ చూసి బ్లెస్‌ చేశారు. అది పెద్ద హిట్‌ అయ్యింది. సాంగ్స్‌ అన్నీ చాలా గ్రాండియర్‌గా, కొత్తగా వున్నాయని మమ్మల్ని బ్లెస్‌ చేశారు. ఆడియన్స్‌ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. పూరి నా డ్రీమ్‌ డైరెక్టర్‌. ఆయన వచ్చి నా సాంగ్స్‌ చూసి చాలా ఇంప్రెస్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఆయనకి నా థాంక్స్‌. ఆయన బ్లెస్సింగ్స్‌ వుంటే మాకు సపోర్టివ్‌గా వుంటుంది'' అన్నారు. 
 
హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.