మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (10:30 IST)

ఏడు నగరాల్లో ప్రమోషన్స్-పుష్ప 2 బాధ్యతలు బన్నీకే.. సుక్కూ బిజీ

Pushpa-2 still
పుష్ప-2 విడుదలకు ఇంకా 26 రోజుల సమయం ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. రోజు రోజుకు పుష్ప సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. 
 
నవంబర్ 15న బీహార్ రాజధాని పాట్నాలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేకర్స్ 6 నగరాల్లో పర్యటించబోతున్నారని తెలుస్తోంది. కానీ ఏడు నగరాల్లో పుష్ప 2 ప్రమోషన్స్ జరుగబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రమోషన్స్ బాధ్యత అల్లు అర్జున్ తీసుకున్నారని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఆయన ఆ పనుల్లో బిజీగా ఉండటంతో పుష్ప 2 ప్రమోషన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూసుకుంటున్నారని తెలుస్తోంది.