నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం
తిరుమలలో నవంబరు 17న కార్తీక వనభోజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి చిన్న గజ వాహనంపై పారువేట మండపానికి చేరుకుంటారు.
శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పారువేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు దేవతలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
అనంతరం కార్తీక వనభోజనం నిర్వహించి, సిబ్బందికి, భక్తులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం, సాయంత్రం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.