చీర కొంగు గాలిలో ఎగురుతుంటే అతడు వచ్చి ముద్దు పెట్టుకునేవాడు... రాధికా ఆప్టే

radhika apte
ప్రీతి చిచ్చిలి| Last Updated: గురువారం, 21 మార్చి 2019 (14:29 IST)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే తెలుగులో కూడా సుపరిచితురాలే. లెజెండ్, లయన్, రక్త చరిత్ర లాంటి చిత్రాల్లో నటించిన ఈమె తన బోల్డ్ వ్యాఖ్యలతో, బోల్డ్ సినిమాలతో సంచలనంగా నిలుస్తుంటారు. పలు శృంగార చిత్రాలలో నటించి, విమర్శపాలైంది కూడా. తాజాగా తను చిన్నప్పుడు కనే ఫాంటసీ కల గురించి చెప్పగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. 
 
అందరి జీవితంలో ఏదో ఒక ఫాంటసీ ఉంటుంది. రొమాన్స్ గురించి అందరికీ ఉన్నట్లుగానే తనకు కూడా 8 ఏళ్ల వయసులోనే రొమాంటిక్ కల ఉండేదని, అది ఇప్పటివరకు నెరవేరలేదని రాధికా ఆప్టే తెలిపింది. తమ ఇంట్లో పని చేసే పనిమనిషికి సినిమాల పిచ్చి ఉండటంతో ఎప్పుడూ సినిమాలు చూస్తూ ఉండేది. దీనితో నాకు కూడా సినిమాలు చూడడం అలవాటైంది. అలా రొమాంటిక్ సాంగ్స్ చూడటం వలన నాకు కూడా ఒక కల ఉండేదని చెప్పింది.
 
పాత సినిమాలలో రెయిన్ సాంగ్స్ ఉండేవి. ఆ వర్షంలో హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ చీరలో అందాలు ఒలకబోస్తుంటే హీరోయిన్‌ను హీరో ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. ఆ హీరో పాత్రలో నాకు తెలిసిన అబ్బాయిని ఊహించుకునేదాన్ని. అతనికి ముద్దు పెడుతున్నట్లు కలగనేదాన్ని. 
 
అతడు నా కలలోకి వచ్చి ముద్దు ఇస్తాడని త్వరగా నిద్రపోయేదాన్ని. కానీ నేను కన్న కల ఇంతవరకు నిజం కాలేదని తెలిపింది. మహిళలు తమకు వచ్చే కలల గురించి బయట చెప్పడంలో తప్పేమీ లేదని చెప్పిన రాధిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.



దీనిపై మరింత చదవండి :