రయీస్‌లో 'లైలా మై లైలా..'కు పెరుగుతున్న క్రేజ్.. సన్నీ పాట వైరల్..
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'రయీస్' చిత్రంలోని సన్నీ లియోన్ ఐటమ్ సాంగుకు మంచి క్రేజ్ వచ్చేసింది. హాట్ స్టార్ సన్నీ లియోన్ 'లైలా మై లైలా..' అంటూ సాగిన పాటకు సంబంధించి వీడియో ప్రస్తుతం సో
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'రయీస్' చిత్రంలోని సన్నీ లియోన్ ఐటమ్ సాంగుకు మంచి క్రేజ్ వచ్చేసింది. హాట్ స్టార్ సన్నీ లియోన్ 'లైలా మై లైలా..' అంటూ సాగిన పాటకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను సినీ యూనిట్ బుధవారం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచి వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో 18వ స్థానంలో ఉంది. పాట విడుదలైన 19 గంటల్లోనే 73 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.
జీనత్ అమన్ గతంలో ఆడిపాడిన 'లైలా మై లైలా..' పాటకు రీమిక్స్‌గా ఈ పాటను తెరకెక్కించారు. ఈ పాట సినిమా విజయంలో కీలకంగా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహించిన 'రయీస్' చిత్రంలో మహీరా ఖాన్ కథానాయికగా నటించారు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.