అందుకే సంగీతం జోలికి వెళ్లలేదు.. కాంచన 3 దర్శకుడు

సందీప్| Last Updated: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:40 IST)
తన కొరియోగ్రఫీలో తెలుగు, తమిళ చలన చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. పెద్ద పెద్ద హీరోలతో స్టెప్పులు వేయించి సినిమాలకు హిట్‌లు సంపాదించిపెట్టాడు. కొరియోగ్రఫీతో తన వృత్తిని ప్రారంభించిన లారెన్స్‌లో కొత్త ఆశలు చిగురించాయి. సినిమాలో పాత్రలు వేయాలనుకున్నాడు. చివరికి ఏకంగా హీరోనే అయ్యాడు. అంతే కాకుండా దర్శకత్వంలో కూడా దిగాడు. 
 
బిగ్ స్టార్‌లతో సినిమాలు తీసి మెప్పులు పొందాడు. దర్శకత్వంతో ఆగలేదు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయాలనుకున్నాడు. డాన్, రెబల్ వంటి పెద్ద హీరోల సినిమాలకు సంగీతం అందించడం వివాదాస్పదం అయింది. రాగాలు తెలిసిన నేను సంగీత దర్శకుడిగా మారితే తప్పేంటి అనుకుని ఆ రెండు సినిమాలకు సంగీతాన్ని అందించాను. కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, సంగీతంలో రాగాలు మాత్రమే ఉంటాయని పొరపాటు పడ్డాను. సంగీతం ఒక సముద్రం లాంటిది. అందుకే పూర్తిగా తెలియని పనిని చేయకూడదని నిర్ణయించుకున్నాను. 
 
అప్పటి నుండి నేను సంగీతం జోలికి వెళ్లలేదు. ఆ రెండు సినిమాలకే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసి తప్పుచేసానని, దర్శకత్వం గురించి తెలియకపోయినా దర్శకత్వం చేయవచ్చని కానీ సంగీతం అలా కాదని లారెన్స్ చెప్పుకొచ్చాడు. లారెన్స్ తాజాగా నటించిన చిత్రం విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ప్రమోషన్‌లో మ్యూజిక్ గురించి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ముని సీరీస్ సినిమాలను ఇది బీట్ చేస్తుందని చెప్పారు.దీనిపై మరింత చదవండి :