రాఘవ లారెన్స్‌తో జతకట్టిన నయనతార... టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇదే!
వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తున్న అందాల ముద్దుగుమ్మ నయనతార కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్‌తో సినిమా చేసేందుకు ఒప్పుకోవడం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన ఇమేజ్‌ను పక్కనబెట్టి లారెన్స్‌తో సినిమా చేసేందుకు నయన అంగీకరించిందా అంటూ చర్చలు జరుగుతున్నాయి.
వెరైటీ రోల్స్‌లో కనిపించేందుకు ఇష్టపడే నయనతార తాజాగా మాయ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ మూవీలో కొత్త హీరోతో నటించింది. మాయ సినిమాను సింగిల్ హ్యాండ్‌తో హిట్ కొట్టేసింది.
అయితే తాజాగా దర్శకుడు కమ్ హీరో అయిన రాఘవ లారెన్స్‌కి జోడీగా నటించేందుకు నయనతార ఓకే చెప్పేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కాంచన సీక్వెల్స్ తీసుకుంటూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్న లారెన్స్.. ఇప్పుడో మూవీ స్టార్ట్ చేయనున్నాడు. ఇందులో లారెన్స్ డ్యుయల్ రోల్ చేయనుండగా.. ఓ పాత్రకి జంటగా నయన అంగీకరించడం విశేషం.