శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (13:20 IST)

రాజా సాబ్ లేటెస్ట్ అప్ డేట్ - ప్రభాస్ చర్చి సెట్ లో ఎంట్రీ

Prabhas entray
Prabhas entray
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా చేస్తూనే మారుతీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా సాబ్ అనే పేరు పెట్టిన ఈ సినిమాలో ప్రభాస్ మంగళవారంనాడు ఎంట్రీ ఇచ్చారు. షంషాబాద్ లోని కొత్తగా నిర్మించిన షాబుద్దీన్ స్టూడియో (హైదరాబాద్ ఫిలింసిటీ) లో ఎంట్రీ ఇచ్చారు. నిధి అగర్వాల్ కథానాయిక. 
 
స్టూడియోలో వేసిన చర్చి సెట్ లో హీరోయిన్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ కోసం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ సందర్భానుసారంగా వచ్చే ఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రిద్ది కుమార్, మాళవిక మోహన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో టి.జి. విశ్వప్రసాద్ నిర్మాత. ఈ సినిమా సెట్ కావడానికి విధి కారణమని ఏదీ మనచేతిలోలేదనీ. ఈ అవకాశం రావడం అద్రుస్టంగా భావిస్తున్నట్లు ఇటీవలే మారుతీ తెలిపారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.