శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 23 నవంబరు 2019 (21:22 IST)

శ్రీనివాస‌రెడ్డిని అభినందించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి

యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. 

ఈ ట్రైల‌ర్ చాలా బావుందంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి స‌హా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. ఇప్పుడు దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ చిత్రంతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న శ్రీనివాస‌రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.
 
“నేను కెరీర్‌ను స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి శ్రీనివాస‌రెడ్డి నాకు తెలుసు. త‌ను మంచి క‌మెడియ‌న్‌. తొలిసారి `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు` సినిమాతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచయం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస‌రెడ్డి అభినంద‌న‌లు తెలుపుతున్నాను`` అంటూ ట్వీట్ చేశారు రాజ‌మౌళి.
 
ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల మెగాప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.