Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్ - తాజా అప్ డేట్
రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్ తాజా అప్ డేట్ వచ్చేసింది. నేడు గురువారం సప్తమి రోజు ఒరిస్సా కు చిత్ర యూనిట్ వెళ్ళింది. అక్కడ కోరాపుత్ అటవీ ప్రాంతంలో షూటింగ్ ను రేపటినుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పోరాట సన్నివేశాలు, ఓ పాటను తెరకేక్కిన్చనున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరువరకు షూటింగ్ ఫారెస్ట్ లోనే జరపనున్నారు.
గత ఏడాది నుంచి షూటింగ్ కు లొకేషన్ వేటను రాజమౌళి మొదలు పెట్టారు. అందులో భాగంగా డిసెంబరులో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌ని పరిశీలించారు. ఈ సినిమాలో దాదాపు ఇండియన్, ఫారిన్ కు చెందిన ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ఇప్పటికే ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పేరులు వెలువడ్డాయి. రెండు ఏళ్లుగా ఈ సినిమా కథపై రచయిత విజయేంద్రప్రసాద్ కసరత్తు చెస్థున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనవరిలోనే హైదరాబాద్ శివారులో అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. అక్కడే వేసిన సెట్లో నటీనటులను ఆడిషన్ చేసారు. అందులో భాగంగా ప్రియాంకా చోప్రా హాజరైంది. ఆ తర్వాత ఇక్కడ వి.సా దేవుడిని దర్శించుకుంది. తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబి 29 అని టైటిల్ పెట్టారు.