బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (17:45 IST)

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

Gayathri
Gayathri
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. శుక్రవారం గుండెపోటు రావటంతో ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్స్ చికిత్స అందించినా పరిస్థితి చేయిదాటి పోవటంతో గాయత్రి కన్నుమూశారు.  
 
రాజేంద్రప్రసాద్‌కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించింది. గాయత్రి అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి.