శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (03:54 IST)

మేకిన్ ఇండియాను చేసి చూపిన రజనీ.. మోదీ మాట మన్నించినట్లేనా?

దక్షిణాది చిత్రపరిశ్రమలో శంకర్ అంటే భారీతనానికి మారుపేరు. అత్యద్భుత విదేశీ సుందర దృశ్యాలకు నిర్వచనం. అత్యంత భారీ స్థాయి చిత్రాలకు శ్రీకారం చుట్టడం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమను గత పాతికేళ్లుగా అబ్బురపరుస్తున్న దర్శక బ్రహ్మ శంకర్. కానీ రజనీ కాంత్‌తో తన

దక్షిణాది చిత్రపరిశ్రమలో శంకర్ అంటే భారీతనానికి మారుపేరు. అత్యద్భుత విదేశీ సుందర దృశ్యాలకు నిర్వచనం. అత్యంత భారీ స్థాయి చిత్రాలకు శ్రీకారం చుట్టడం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమను గత పాతికేళ్లుగా అబ్బురపరుస్తున్న దర్శక బ్రహ్మ శంకర్. కానీ రజనీ కాంత్‌తో తను తీస్తున్న అతి భారీ చిత్రం 2.0లో మాత్రం శంకర్ చేతులు కట్టేశారు. ఎంతగా అంటే దేశం విడిచి బయటకు పోలేనంతగా. శంకర్ సినిమా పూర్తిగా భారత్‌లోనే భారతీయ లొకేషన్లలో భారత్ అందాలతో మన ముందుకు వస్తోంది. 

 
 
దీనికి కారణం రజనీ కాదు. చిత్ర నిర్మాతల పిసినారితనం అంతకంటే కాదు. ప్రధాని మోదీ మాటను రజనీ గౌరవించిన ఫలితం ఇది. తన కలల పథకం 'మేకిన్‌ ఇండియా' గురించి రజనీకాంత్‌తో పంచుకున్నారని సమాచారం. మేకిన్ ఇండియాకు వన్నె తెచ్చేలా 2.0 సినిమాను పూర్తగా భారత్‌లోనే చిత్రీకరించి తన పథకానికి ఉదాహరణగా నిలవాలని మోదీ కోరారట. 
 
మోదీ మాటను మన్నించిన తలైవా రజనీ... అన్నట్టుగానే '2.0' షూటింగ్‌ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్‌ చాలావరకు చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరిగింది. సినిమా క్లైమాక్స్‌ను మాత్రం ఢిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ మైదానంలో తీశారు. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న '2.0'ను.. చైనా విఖ్యాత సినిమా 'క్రౌచింగ్‌ టైగర్‌.. హిడెన్‌ డ్రాగన్‌' స్థాయిలో తీయబోతున్నట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ ప్రకటించింది.