శంకర్ '2.O' షూటింగ్‌లో ప్రమాదం.. రజినీకాంత్‌కు గాయాలు...
ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం "2.O". ఈ చిత్రం షూటింగ్‌లో చిన్నపాటి ప్రమాదం జరిగింది. దీంతో చిత్ర హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ కుడికాలికి చిన్నపాటి గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి
ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం "2.O". ఈ చిత్రం షూటింగ్‌లో చిన్నపాటి ప్రమాదం జరిగింది. దీంతో చిత్ర హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ కుడికాలికి చిన్నపాటి గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం రజినీ ఇంటికి వెళ్లిపోయినట్టు చిత్రబృందం తెలిపింది.
రజినీకి గాయాలయ్యాయి అనే వార్తతో ఆయన అభిమానులు కంగారు పడిపోయారు. అయితే, భయపడాల్సిన పనేంలేదనీ, గాయం చిన్నదేనని చిత్రబృందం క్లారిటీ ఇవ్వడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న '2.O'లో రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లతో '2.O' తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
'కబాలి' షూటింగ్ తర్వాత రజినీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు అమెరికాలో చికిత్స చేయించుకున్నారు కూడా. ఆరోగ్యం కుదుటపడ్డాకే.. '2.0' షూటింగ్‌లో పాల్గొన్నారు.