గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (13:19 IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎవరి ఫ్యాన్ తెలుసా...?

సినీ హీరోలకి అభిమానులు ఉండడం సర్వ సాధారణం. కాని ఆ హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో అభిమానులై పోతుంటారు. అసలు విషయం ఏంటంటే...భారతదేశం మొత్తం అభిమానించే సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇప్పుడు ఓ అభిమానిగా మ

సినీ హీరోలకి అభిమానులు ఉండడం సర్వ సాధారణం. కానీ ఆ హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో అభిమానులై పోతుంటారు. అసలు విషయం ఏంటంటే... భారతదేశం మొత్తం అభిమానించే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు ఓ అభిమానిగా మారిపోయారు. ''హ్యాట్సాఫ్ టు యు పివి.సింధు. ఇప్పుడు నేను నీకు అత్యంత పెద్ద ఫ్యాన్ అయిపోయాను. కంగ్రాట్యులేషన్స్'' అంటూ రజినీ ట్వీట్ చేయడమే దీనికి ముఖ్య కారణం.
 
 ఈ ఒక్క దెబ్బతో ఇండియా అంతా రజినీకాంత్ పేరు మారుమోగిపోతోంది. ఆయన ట్వీట్ వేసిన నిమిషాల్లోనే మీడియా అంతట రజినీ ఎవరి ఫ్యానో తెలుసా అంటూ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయ‌న చెప్పిన స‌మాధానానికి కూడా వేల లైక్‌లు వచ్చి ప‌డ్డాయి. అటువంటి వ్య‌క్తే సింధూకి అభిమానిన‌ని చెప్ప‌డం నిజంగా ఆశ్చ‌ర్యమే. 
 
దేశానికి తొలిసారిగా సిల్వర్ మెడల్ తెచ్చిన మహిళగా పి.వి.సింధు ఇప్పుడు చరిత్ర సృష్టించింది. భారతీయ ఖ్యాతిని అత్యుతన్నత శిఖరాల మీద నిలబెట్టింది. రియో 2016 ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఫైనల్ లోకి ప్రవేశించి కోట్లమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. అలాంటి కోట్ల హృదయాల్లో దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ హృదయం కూడా ఉండటం నిజంగా అదృష్టమే.