రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది.. వెనకడుగు లేదు...
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ జ్యోతిష్కుడు షెల్వి జోస్యం చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందనీ, ఇక ఆయన వెనకడుగు వేయబోరని తేల్చి చెప్పారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ జ్యోతిష్కుడు షెల్వి జోస్యం చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందనీ, ఇక ఆయన వెనకడుగు వేయబోరని తేల్చి చెప్పారు. గత రెండు రోజులుగా రజనీకాంత్ తన ఫ్యాన్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ.. ఫోటోలు దిగుతున్న విషయం తెల్సిందే. దీంతో తన రాజకీయ రంగ ప్రవేశం కోసమే రజనీకాంత్ ఈ విధంగా చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీనిపై షెల్వి స్పందిస్తూ... "రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యమని, సినిమాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన రాజకీయాల్లోనూ అదే తరహాలో రాణిస్తారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇక వెనకడుగు వేయరు’’ అని చెప్పారు.
కాగా, అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఫొటోసెషన్ ప్రారంభోత్సవంలో దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని, రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.