శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (15:21 IST)

రాకేష్ రోషన్‌కు కేన్సర్ : షాకింగ్ న్యూస్‌ను వెల్లడించిన హృతిక్ రోషన్

బాలీవుడ్ సీనియర్ నటుడు రాకేష్ రోషన్‌కు కేన్సర్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించారు. తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను హృతిక్ రోషన్ షేర్ చేశాడు. 
 
ఆ ఫోటో కింద పెట్టిన కామెంట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఈ ఉదయం మా నాన్నతో ఓ ఫోటో తీసుకోవాలని ఉందని అడిగాను. సర్జరీ జరిగే రోజు కూడా ఆయన వ్యాయామం మానలేదు. మా నాన్న చాలా బలమైన వారు. కొద్ది వారాల క్రితం ఆయన గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇది ప్రారంభ దశలోనే ఉందని, కేన్సర్‌పై యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరారు. ఆయన వంటి తండ్రి దొరకడం నాకెంతో అదృష్టం. మా కుటుంబానికి కూడా ఐ లవ్ యూ డాడ్' అంటూ పోస్ట్ చేశారు.