1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (17:47 IST)

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రేమ కథగా శశివదనే విడుదలకు సిద్ధం

Rakshit Atluri- Komali
Rakshit Atluri- Komali
‘పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్ అట్లూరి. అలాంటి రక్షిత్ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతోన్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఇది AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
శశి వదనే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుంది.. మళ్లీ గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది.
 
ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ ఆ పోస్టర్ మీద హైలెట్‌గా నిలిచింది. ఆ డైలాగ్ద‌తో సినిమా సారాన్ని చెప్పేశారు. శశివదనే స్వచ్చమైన గ్రామీణ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు. ఏప్రిల్ 5న రానుంది.