శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 జులై 2017 (03:25 IST)

ఈ క్రేజీ హీరోయిన్‌తో ఢీకొట్టడం ఎవరికి సాధ్యం? టోటల్ దక్షిణాది ఫిదా

తెలుగులో నటిస్తే తెలుగు భాషను, తమిళంలో నటిస్తే తమిళభాషను, మలయాళంలో నటిస్తే మలయాళీ భాషను అలవోకగా మాట్లాడే అరుదైన ఉత్తరాది నటీమణుల్లో రకుల్ ప్రీత్‌ది అగ్రస్థానం. అగ్రహీరోలతో, యువహీరోలతో, చిన్న హీరోలతో జతకడుతూ తన పాత్రకు లోటు రానీయకుండా ప్రతి సినిమానూ ప

తమిళ సూపర్ స్టార్ సూర్య ఎన్ని అద్భుత చిత్రాల్లో వైవిధ్య పూరితమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాని 20 ఏళ్ల తన సినీ జివితంలో సూర్య చేసిన సినిమాలు 36 మాత్రమే అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజం. కానీ ప్రస్తుతం టాలీవుడ్, కొలివుడ్, మాలివుడ్, శాండల్ వుడ్  ఇలా దక్షిణాది చిత్రసీమల్లో ప్రతి భాషలోనూ వరుసగా సినిమాలు తీస్తూ కెరీర్‍‌ని తీర్చిదిద్దుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్లలో సూర్య రికార్డును చెరిపేయనున్నారు. తెలుగులో నటిస్తే తెలుగు భాషను, తమిళంలో నటిస్తే తమిళభాషను, మలయాళంలో నటిస్తే మలయాళీ భాషను అలవోకగా మాట్లాడే అరుదైన ఉత్తరాది నటీమణుల్లో రకుల్ ప్రీత్‌ది అగ్రస్థానం. అగ్రహీరోలతో, యువహీరోలతో, చిన్న హీరోలతో జతకడుతూ తన పాత్రకు లోటు రానీయకుండా ప్రతి సినిమానూ ప్రత్యేతంగా తీసుకుంటా నటిస్తున్న రకుల్ ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్.
 
టాలీవుడ్‌లో ప్రముఖ యువ హీరోలతో జత కడుతూ యమ క్రేజీ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ చలామణి అవుతుంది. ఆ అందాల రాశి కెరీర్ మొదట్లో తమిళ చిత్రాల్లో మొదలైనా, ఒక సక్సెస్ కూడా అందలేదు. అలాంటిది ఇప్పుడు అవకాశాలు వరస కడుతున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో మరో లక్కీఛాన్స్ ఎదురు చూస్తున్నట్లుంది. తమిళ చిత్రసీమలో రాణించాలనే ఆశ కూడా ఈ అమ్మడు నెరవేర్చుకునేలా ఉంది.
 
ఇప్పటికే ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం స్పైడర్‌తో పాటు, కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపైనా మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా సూర్య హీరోగా నటించే చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా  నటించే అవకాశం తలుపుతట్టినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం సూర్య తానాసేర్నాంద కూటం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత  సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
ఇందులో ఆయనకి జంటగా హీరోయిన్ రకుల్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సెల్వ రాఘవన్ సంతానం హీరోగా మన్నవన్ వందాదడీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత సూర్య, రకుల్ నటించే చిత్రాన్ని హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం సూర్యకు 36వ చిత్రం అవుతుంది. మొత్తం మీద నటి రకుల్‌ను కోలీవుడ్‌లో మళ్లీ చూడబోతున్నామన్న మాట.