భర్తతో రకుల్ ప్రీత్ సింగ్ ఆక్రోయోగా.. ఫోటో వైరల్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ యోగా వీడియోను పోస్టు చేసింది. తన భర్త నిర్మాత జాకీ భగ్నానితో యోగా వీడియోను షేర్ చేసింది. ఈ చిత్రంలో రకుల్, జాకీ ఆక్రోయోగా భంగిమలో ఉన్నారు. ఇందులో వారు బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీని ప్రదర్శించారు.
"ఆరోగ్యంతో అన్ని విషయాలు అందంగా ఉంటాయి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.." అని రకుల్ పేర్కొంది. ఇకపోతే.. బాలీవుడ్ నిర్మాత జాకి భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒకపక్క సినిమాలు మరొకపక్క బిజినెస్‌లతో ముందుకు తీసుకెళ్తుంది.
కాగా రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ తన తెలుగు సినిమాను ఓకే చేసిందట. సామజవరగమన సినిమా రచయిత డైరెక్టర్‌గా మారుతూ రవితేజతో 75వ సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.