శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (08:59 IST)

'జిక్యూ' టాప్-50లో రామ్ చరణ్: బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీల్లో చెర్రీకి 15వ స్థానం.. మరి బన్నీ, ప్రిన్స్ సంగతి?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రముఖ మెన్స్ మేగజైన్ 'జిక్యూ' జాబితాలో టాప్-50లో నిలిచాడు. ఇటీవల టాప్-50 ఇండియన్ బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీల లిస్టులో టాలీవుడ్ నుంచి చెర్రీ మాత్రమే స్థానం దక్కించుకున్నాడు

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రముఖ మెన్స్ మేగజైన్ 'జిక్యూ' జాబితాలో టాప్-50లో నిలిచాడు. ఇటీవల టాప్-50 ఇండియన్ బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీల లిస్టులో టాలీవుడ్ నుంచి చెర్రీ మాత్రమే స్థానం దక్కించుకున్నాడు. చెర్రీ వరకే జిక్యూలో స్థానం సంపాదించుకోవడంతో.. స్టైలిష్ స్టార్‌గా పేరుగాంచిన అల్లు అర్జున్ ప్రిన్స్ మహేష్ బాబులకు ఈ జాబితాలో స్థానం దక్కకపోవడం ప్రస్తుతం హాట్ న్యూస్‌గా మారింది. 
 
అయితే బాలీవుడ్‌లో నటించిన హీరోలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేశారని.. అందుకే ఇతర టాలీవుడ్ హీరోలెవరికీ ఈ జాబితాలో చోటుదక్కలేదని సినీ జనం అంటున్నారు. చెర్రీ బాలీవుడ్‌లో జంజీర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీంతో చెర్రీని కూడా బాలీవుడ్‌ హీరోగానే పరిగణించి ఈ లిస్టును తయారు చేశారు. 50మందితో కూడిన ఈ జాబితాలో చెర్రీకి 15వ స్థానం లభించింది. 
 
చెర్రీ ఏ ప్రోగ్రామ్‌కు వెళ్ళినా చాలా స్పెషల్‌గా కనిపిస్తాడు. ఒక మాస్ హీరో కంటే ఓ కార్పొరేట్ కంపెనీ అధినేతగా బయట చెర్రీ బాడీ లాంగ్వేజ్ ఉంటుందనే కామెంట్స్ వున్నాయి. అదీకాకుండా రామ్ చరణ్ తనకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న డ్రస్‌లను వేసుకుంటాడు. చరణ్ స్టైలిష్ లుక్ వెనుక అతడి సోదరి సుస్మిత సలహాలు కూడ ఉన్నాయని సమాచారం.