ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (14:30 IST)

వ్యభిచారం: పోలీస్ రైడ్లలో దొరికిపోయిన రామ్ సహనటి.. రాఖీకి ఫ్రెండ్ కోసం వచ్చిందట..!

ఏపీలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వ్యభిచార ముఠా.. మరోసారి విశాఖ ఒన్ టౌన్ పరిధిలో గల అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలుగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. పోలీసుల వద్ద పట్టుబడిన

ఏపీలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వ్యభిచార ముఠా.. మరోసారి విశాఖ ఒన్ టౌన్ పరిధిలో గల అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలుగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. పోలీసుల వద్ద పట్టుబడిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళితే..  స్థానిక టిపిఎం స్కూల్ వెనుక గల సాయిమౌళి అపార్ట్‌‌మెంట్స్‌‌లో 909 నెంబర్ గదిలో వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రైడ్ నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళల్లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హీరోయిన్ అని తేలింది. ఆమె ప్రముఖ హీరో రామ్ సరసన ఓ కొత్త సినిమాలో గెస్ట్‌రోల్‌‌గా నటిస్తున్నట్లు తెలిపింది. 
 
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉందని పోలీసులు తెలిపారు. సినిమాలే కాకుండా టీవీ సీరియల్‌లో ఈమె నటిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చానని, ఇందులో తన ప్రమేయం లేదని సదరు హీరోయిన్ వెల్లడించింది.