బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 మే 2017 (11:53 IST)

శ్రీదేవి శివగామిని మిస్ చేసుకోవడం బాధేసింది.. నిజంగా షాకయ్యా: వర్మ

తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో నటించిన వారికందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా "శివగామి" పాత్రకు జనాలు జైజేలు పలుకుతున్నారు. ఈ పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోసి

తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో నటించిన వారికందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా "శివగామి" పాత్రకు జనాలు జైజేలు పలుకుతున్నారు. ఈ పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రారంభానికి ముందు.. ఈ పాత్ర కోసం దర్శక నిర్మాతలు శ్రీదేవిని సంప్రదించారని.. అయితే ఆమె భారీగా పారితోషికం కావాలని అడగడంతో... ఆమెను రాజమౌళి పక్కనబెట్టి రమ్యకృష్ణను శివగామి రోల్‌కు తీసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో త‌న అభిమాన న‌టి, ఒక‌ప్ప‌టి అగ్ర హీరోయిన్ శ్రీదేవి.. బాహుబ‌లిలో అవ‌కాశాన్ని వ‌దులుకుని చాలా పెద్ద త‌ప్పు చేసింద‌ని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బాహుబ‌లిలో అవ‌కాశాన్ని శ్రీదేవి వ‌దులుకోవ‌డం నిజంగా నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అత్య‌ద్భుత‌మైన ఆమె కెరీర్‌లో ఈ సినిమా కూడా చేరివుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక‌వేళ శ్రీదేవి ఈ సినిమాలో న‌టించి ఉంటే ప్ర‌భాస్ కంటే ఆమెకే ఎక్కువ పేరు వ‌చ్చి ఉండేద‌ని వ‌ర్మ ట్వీట్ చేశాడు.