రౌడీలు, గుండాలు గురించి నేర్చుకుంది విజయవాడలోనే : రామ్ గోపాల్ వర్మ
''నాకు, సిద్ధార్థ అనే పేరుకు మంచి రిలేషన్ ఉంది. నేను రౌడీలు, గుండాలు గురించి నేర్చుకుంది విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్‌లోనే. అలాగే ఇప్పుడు వంగవీటి సినిమా కూడా తీస్తున్నాను. గోపాల్‌రెడ్డిగారు, మణిశర్మగ
''నాకు, సిద్ధార్థ అనే పేరుకు మంచి రిలేషన్ ఉంది. నేను రౌడీలు, గుండాలు గురించి నేర్చుకుంది విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్‌లోనే. అలాగే ఇప్పుడు వంగవీటి సినిమా కూడా తీస్తున్నాను. గోపాల్‌రెడ్డిగారు, మణిశర్మగారు, ఈ ఇద్దరితో నాకు మంచి అనుబంధం ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు గొప్ప రచయితలు. వారి గొప్పతనం పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. దాసరి కిరణ్‌కుమార్ మంచి నిర్మాత, మా కాంబినేషన్‌లో వంగవీటి సినిమా రానుంది. సాగర్ హీరోగా చూడటానికి బావున్నాడు.
'సిద్ధార్థ' సినిమాలోని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ బావున్నాయి. సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని.. రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'సిద్ధార్థ'. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలలో ఆయన పాల్గొన్నారు. కాగా, ఈ సినిమాను ఈనెల 16న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.