శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (15:55 IST)

సంక్రాంతికి కోడిపందేల్లా బాలయ్య Vs చిరంజీవి సినిమాలు.. రామ్ గోపాల్ వర్మకు కుళ్లెందుకు?

సంక్రాంతికి కోడిపందేల్లా బాలయ్య, చిరంజీవి సినిమాలో పోటీకి సై అంటున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ జనవరి 11న, నందమూరి హీరో బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జన

సంక్రాంతికి కోడిపందేల్లా బాలయ్య, చిరంజీవి సినిమాలో పోటీకి సై అంటున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ జనవరి 11న, నందమూరి హీరో బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదల కానున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడిగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమా రిలీజ్‌కు సినిమా హాళ్ల సమస్య ఉండదు. అదే సమయంలో సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లు ఉండటంతో ఆయన బావ చిరంజీవి సినిమా విడుదలకు ఇబ్బందులు ఏమీ వుండవు.
 
కానీ రెండు సినిమాలను సక్సెస్ చేసేందుకు ఫ్యాన్స్ సైతం రెడీగా ఉన్నారు. చాలారోజుల తర్వాత టాలీవుడ్‌లో ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని ఇప్పటికే సినీ పండితులు అంటున్నారు.

ఇద్దరు అగ్రహీరోలు తమ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా సంక్రాంతికి రావడం మంచి పరిణామమేనని వారు చెప్తున్నారు. సినిమా రిలీజ్‌లను వాయిదా వేసుకోకుండా తమ సత్తాను నిరూపించుకునేందుకు టాలీవుడ్ అగ్రహీరోలు పోటీపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో వంగవీటి లాంటి తన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇతరుల సినిమాలపై మీద విషంకక్కుతున్నాడు. ఎప్పట్లాగే పిట్టకూతలు కూసిన వర్మ ఈసారి సంక్రాంతికి రాబోతోన్న రెండు పెద్దసినిమాలపై పడ్డాడు.

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం150, బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్రశాతకర్ణిల మీద డైరెక్ట్‌గా అటాక్ చేయకుండా.. సన్నాయి నొక్కులు నొక్కుతూ పిట్టకబుర్లు చెప్పుకొస్తూ చివరికి రెండు సినిమాలు వేస్ట్ సినిమాలే అన్నట్టు తేల్చాడు వర్మ. దీంతో అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ వర్మమీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి వీటికి వర్మ ఏమంటారో?