శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (12:53 IST)

జయలలిత నెచ్చెలి శశికళ పేరుతో సినిమా తీస్తా : రాంగోపాల్ వర్మ ట్వీట్

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ పేరుతో ఓ సినిమా తీయనున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి తన ట్విటర్ ఖాతాలో వెల్లడించ

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ పేరుతో ఓ సినిమా తీయనున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఒకప్పుడు జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో తీసిన 'వంగవీటి' సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన కన్ను తమిళ రాజకీయాలపై పడినట్టు తెలుస్తోంది. జయలలిత ఈనెల 5వ తేదీన కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో జయలలిత నిచ్చెలి శశికళ పేరుతో ఓ సినిమా తీయనున్నట్లు రాంగోపాల్ వర్మ గురువారం రాత్రి ట్వీట్ చేశాడు. ఆ సినిమా పేరు 'శశికళ' అని వర్మ ప్రకటించాడు. 
 
వాస్తవానికి జయలలిత - శశికళల మధ్య ఉన్న స్నేహం, సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయలలిత చనిపోయిన సమయంలో కూడా శశికళపై పలు ఆరోపణలొచ్చాయి. జయను ఆమే కుట్రపూరితంగా అంతమొందించిందంటూ ప్రచారం కూడా సాగింది. అయితే అనేక వివాదాల మధ్య శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టనుంది. ఇలా జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయమంతా శశికళ చుట్టూనే తిరిగింది. ఈ పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఏ విధంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తారోనన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. 
 
శశికళ పేరుతో ఓ ఫిక్షనల్ డ్రామాను తెరకెక్కిస్తున్నానని, ఓ పొలిటీషియన్ ఆప్త స్నేహితురాలి జీవిత నేపథ్యంలో సాగే సినిమా అని వర్మ ట్వీట్ చేశాడు. శశికళ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు వర్మ తెలిపాడు. జయలలిత అంటే తనకు గౌరవమని, శశికళ అంటే అంతకుమించిన గౌరవమని వర్మ ట్వీట్ చేయడం గమనార్హం.