మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2016 (19:42 IST)

నాకు చికిత్స చేయించుకునేందుకు మెదడు ఉంది... ఆ కాంగ్రెస్ వాళ్లకు అది కూడా లేదు... వర్మ

తనకు పిచ్చి పట్టిందంటూ మెంటల్ ఆసుపత్రిలో లేఖలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడుతూ రివర్స్ ఎటాక్ చేశారు. ఆయన విడుదల చేసిన సమాధానం ఇలా ఉంది.
 
''నా మెదడుకి చికిత్స చెయ్యాలని చెప్తున్న ఆ కాంగ్రెస్ వాళ్లకి నా సమాధానం- నాకు కనీసం చికిత్స చెయ్యడానికి మెదడన్నా ఉంది. వాళ్లకి ఆ మెదడు కూడా లేకపోవడం మూలానే అలాంటి కూతలు కూస్తూ, అటువంటి చేష్టలు చేస్తున్నారు. మెదడు లేకుండా కూడా మనుషులు బతికేయొచ్చని నిరూపించిన ఆ అద్భుతమైన కాంగ్రెస్ వాళ్లని అడ్వాన్స్డ్ మెడికల్ రీసర్చ్ కోసం అమెరికా పంపించవలసిందిగా నరేంద్రమోడీ గారికి నేను వినతిపత్రం అందించబోతున్నా'' - రామ్ గోపాల్ వర్మ.